Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ కౌంటింగ్ పై కూడా రైతుల ఎఫెక్ట్...

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రారంభంనుండి బాగా చర్చ జరుగుతున్న నియోజకవర్గం నిజామాబాద్. ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు, సిట్టింగ్ ఎంపీ కవితపై కేవలం  ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులే కాదు...స్వయంగా రైతులు పోటీకి దిగారు. దాదాపు 185 మంది అభ్యర్థులు ఇక్కడ ఫోటీలో వుండటంతో  ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా స్పెషల్ గా జరిగింది.  తాజాగా ఓట్ల లెక్కింపుపై కూడా పసుపు రైతుల నిరసన ప్రభావం పడనుంది. 

nizamabad lok sabha constituency votes counting
Author
Nizamabad, First Published May 23, 2019, 8:22 AM IST

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రారంభంనుండి బాగా చర్చ జరుగుతున్న నియోజకవర్గం నిజామాబాద్. ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు, సిట్టింగ్ ఎంపీ కవితపై కేవలం  ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులే కాదు...స్వయంగా రైతులు పోటీకి దిగారు. దాదాపు 185 మంది అభ్యర్థులు ఇక్కడ ఫోటీలో వుండటంతో  ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా స్పెషల్ గా జరిగింది.  తాజాగా ఓట్ల లెక్కింపుపై కూడా పసుపు రైతుల నిరసన ప్రభావం పడనుంది. 

ఇక్కడ అత్యధికంగా అభ్యర్ధులు బరిలో వుండటంతో ఈవీఎంలను కూడా అదే స్థాయిలోమ ఉపయోగించారు. ఇలా ఈవీఎంల సంఖ్య అధికంగా వుండటంతో మిగతా లోక్ సభ నియోజవర్గాల కంటే ప్రతి రౌండ్ ఫలితం కాస్య ఆలస్యం కానుంది. ఇలా నిజామాబాద్ లోక్ సభ తుదిఫలితమే తెలంగాణలో చివరగా వెలువడనుంది.  

ఇక అతి తొందరగా కౌంటింగ్ ప్రక్రియ నిజామాబాద్ లో ముగియనుంది.ఇక్కడ అతి తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇక్కడ తుది ఫలితం మొదట వెలువడనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios