నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ వైద్యులు ఈ రోజు 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేశారు. ఈ రికార్డు సృష్టించిన వైద్యులపై మంత్రి హరీష్ రావు అభినందనలు కురిపించారు. 

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో 24 గంటల్లో పది మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేపట్టి రికార్డు సృష్టించారు. ఈ శస్త్ర చికిత్సలకు సుమారు రూ. 4 లక్షలకు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. కానీ, వీటిని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేసినట్టు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నిజానికి గతంలో ప్రభుత్వ హాస్పిటల్‌లలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయలేదు. మూడు నెలల నుంచే ఈ సర్జరీలను ప్రారంభించినట్టు ఆ వైద్యులు వెల్లడించారు. ఈ రోజు ఏకంగా పది సర్జరీలు చేసినట్టు తెలిపారు.

Scroll to load tweet…

వరల్డ్ ఆర్థిరిటిస్ డే సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. సింగిల్ డేలో 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వ ఆరోగ్య వసతులను బలోపేతం చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.