లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో వలసలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కాంగ్రెస్‌కు చెందిన పలువురు సర్పంచులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలానికి చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడితో పాటు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్, యువజన నాయకులు ఎంపి కవిత సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

బంగారు తెలంగాణ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తాము భాగస్వాములం కావాలనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితను తిరిగి గెలిపించుకుంటామని తెలిపారు. 

"