Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్‌ జిల్లాలో సిజేరియన్లపై కలెక్టర్ సీరియస్.. 54 ఆస్పత్రులకు నోటీసులు..

తెలంగాణ సిజేరియన్లను తగ్గించి.. నార్మల్ డెలివరీలను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో సిజేరియన్లు పెరగడంపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. నిబంధనలు పాటించని 54 ప్రైవేట్ ఆస్పత్రులు నోటీసులు ఇచ్చారు. 

Nizamabad collector serious over  Cesarean deliveries
Author
First Published Jul 31, 2022, 10:39 AM IST

తెలంగాణ సిజేరియన్లను తగ్గించి.. నార్మల్ డెలివరీలను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా, ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా సిజేరియన్లను తగ్గించి.. నార్మల్ డెలివరీలను పెంచేలా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిందే. ఇందుకు సంబంధించి ప్రత్యేక వర్క్ షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో సిజేరియన్లు పెరగడంపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిబంధనలు పాటించని 54 ప్రైవేట్ ఆస్పత్రులు నోటీసులు ఇచ్చారు. 

జిల్లాలో ఇటీవలి కాలంలో సిజేరియన్ల సంఖ్య పెరిగింది. నార్మల్ డెలివరీ అయ్యేందుకు చాన్స్ ఉన్నప్పటికీ.. కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బులకు ఆశపడి అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. 8 తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లలోని ప్రసూతి ఆస్పత్రులలో ఆ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రులలో సౌకర్యాలు, ఇతర వివరాలను ఆరా తీశారు. దాదాపు 10 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. అనంతరం తనిఖీ బృందాలు.. నివేదికను రూపొందించి డీఎంహెచ్‌వోకు అందజేశాయి.

ఇక, తనిఖీ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలోని మొత్తం 54 ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అధికారులు వెల్లడించారు. నోటీసులు జారీ అయిన వాటిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 37 ఆస్పత్రులు, బోధన్‌లోని 8 ఆస్పత్రులు, ఆర్మూరులోని 9 ఆస్పత్రులు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. గత నెలలో కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలోని ప్రసూతి ఆసుపత్రిలో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సి-సెక్షన్ తోనే 75శాతం వరకు ప్రసవాలు జరగడం బాధాకరమన్నారు. నిజామాబాద్ జిల్లాలో మే నెలలో 1,913 మంది గర్బిణీలు ప్రసవించగా.. అందులో 1,444 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగాయి. 459 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 100 శాతం సిజేరియన్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios