బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని సంచలనాలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని కలిసి బరిలో దిగే అవకాశముందని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని సంచలనాలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని కలిసి బరిలో దిగే అవకాశముందని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించిందని .. టీఆర్ఎస్ శాసనసభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరు వచ్చినా బీజేపీలోకి ఆహ్వానిస్తామని అర్వింద్ పేర్కొన్నారు.
అంతకుముందు పార్లమెంటు సమావేశాలను (parliament winter session) టీఆర్ఎస్ (trs) బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేవలం ఫంక్షన్లు ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారంటూ బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (congress) , టీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒకటేనని.. పార్లమెంటులో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బండి సంజయ్ గుర్తుచేశారు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని ఆయన వెల్లడించారు.
ALso Read:ఫంక్షన్ల కోసమే పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ: టీఆర్ఎస్ ఎంపీలపై బండి సంజయ్ వ్యాఖ్యలు
ఫైళ్లపై సంతకాలు చేసేటప్పుడు సీఎం కేసీఆర్ (kcr) సోయిలో ఉండాలని హితవు పలికారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సంతకం చేశారని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేశారని... రేపు దేనిపై సంతకం చేస్తారోనంటూ బండి ఎద్దేవా చేశారు. ప్రతి గింజను కొంటానని మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌దంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దేశానికి ఉపరాష్ట్రపతి అవుతారంటూ ప్రచారం చేయించుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్, ఆయన మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లనే పార్టీలో చేర్చుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోబోమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని.. పార్లమెంట్ సమావేశాల అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.
