Asianet News TeluguAsianet News Telugu

నిజ జీవితంలో దొంగగా మారిన ‘నివురు’ సినిమా హీరో

‘నివురు’ అనే సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. అయితే ఆ చిత్రం బక్సాఫీస్‌ వద్ద బొల్తా కొట్టింది. దీంతో అప్పుల పాలయ్యాడు.

nivuru movie hero held in robbery case
Author
Hyderabad, First Published Aug 15, 2018, 10:25 AM IST

సినిమాల్లో రాణించాలనే కోరికతో ఓ సినిమాని కూడా తెరకెక్కించారు. కానీ అది అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో అప్పులపాలయ్యాడు. ఆ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు దొంగ అవతారం ఎత్తాడు. ఇదేదో సినిమా కథ కాదు. నిజ జీవితంలో ఓ సినీ నటుడు దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్‌.. విక్కీరాజ్‌ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. కాగా మహేష్‌కు సినిమాలంటే పిచ్చి. ఈ క్రమంలో ‘నివురు’ అనే సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. అయితే ఆ చిత్రం బక్సాఫీస్‌ వద్ద బొల్తా కొట్టింది. దీంతో అప్పుల పాలయ్యాడు. విక్కీరాజ్‌కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. నగరంలో సంపన్నులుండే కాలనీల్లో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించే వాడు. తాను కేబుల్‌ ఆపరేటర్‌గా చెప్పుకుంటూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసేవాడు. రాత్రివేళల్లో ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. ఇలా తస్కరించిన సొమ్మును మహేష్‌కు తెచ్చివ్వగా అతడు విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకుని జల్సాలు చేయడంతో పాటు అప్పులు తీరుస్తూ వచ్చారు.

ఇలా దొంగతనాలకు పాల్పడుతూ విక్కీ 2016లో జూబ్లీహిల్స్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలు మానకపోగా 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలు ఇళ్లల్లో చోరీలకు తెగబడ్డాడు. ఇతనిపై ఓయూ పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, ఆ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా, విక్కీ బలిజ, మహేష్‌లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాము ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా విక్కీపై పీడీయాక్టు నమోదు చేసినట్లు ఓయూ పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios