కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రూ. 4,927 కోట్ల వ్యయంతో నిర్మించే రహదారులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అయితే నితిన్ గడ్కరీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన పలువురు జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రశాంత్ రెడ్డి మాట్లాడటానికి రాగానే.. ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రశాంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. తన చేతితో నినాదాలు ఆపాలన్నట్టుగా సూచన చేసిన లాభం లేకుండా పోయింది. దీంతో కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
ఇది ప్రభుత్వ కార్యక్రమం అని.. అందరూ సహకరించాలని కోరారు. ఏ మాత్రం గౌరవం ఉన్న దయచేసి నినాదాలు ఆపాలని చెప్పారు. ఇదేం పద్దతి అని నినాదాలు చేస్తున్న వారిని ప్రశ్నించారు. దీంతో నినాదాలు చేయడం నిలిచిపోయింది. అనంతరం ప్రశాంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
