తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడగా... లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ప్రాదేశిక పోరు మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. దీంతో.. ఈ ఎన్నికల కోసం నేతలు సిద్ధమౌతున్నారు. తెలంగాణణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు... ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ వారికే టికెట్లు కేటాయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా వైఖర్ ఎక్కువగా కనపడుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మరీ.. తన స్నేహితుడు  రామకృష్ణా రెడ్డి భార్య విజయకు జెడ్పీ ఛైర్ పర్సన్ టికెట్ కేటాయించారు. ఆమె మామడ మండలం కప్పారపల్లి గ్రామానికి చెందిన మహిళ. ఇటీవల ఆమె టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 

మొదట ఇంద్రకరణ్ రెడ్డి తన కోడలిని రంగంలోకి దించుదామని అనుకున్నారట. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని తన స్నేహితుని భార్యకు టికెట్ దక్కేలా చేశారనే ప్రచారం జరుగుతోంది.