Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృత్యువాత

శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది విధుల్లో ఉన్నారు.

Nine dead in Srisailam power plant fire accident
Author
Srisailam, First Published Aug 21, 2020, 4:32 PM IST

నాగర్ కర్నూలు: శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. గత రాత్రి జరిగిన ప్రమాదంలో ఈ 9 మంది లోపల చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వారిని కాపాడలేకపోయారు. తొమ్మిది మంది మరణించిన విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో లోపల 17 మంది చిక్కుకున్నారు. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే విధుల్లో చేరారు. మరో అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్ తన సహోద్యోగులను కాపాడే ప్రయత్మం చేశారు. ఐదు నిమిషాల్లో తాను మరణిస్తున్నానని, తన వద్దకు ఎవరూ రావద్దని ఆయన మోహన్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది. లోపల చిక్కుకున్నవారంతా మరణించినట్లు తెలుస్తోంది.

మృతులు వీరే

1. డీఈ శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2. ఏఈవెంకట్‌రావు, పాల్వంచ
3. ఏఈ మోహన్ కుమార్, హైదరాబాద్
4. ఏఈ ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5. ఏఈ సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్

దట్టంగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలిగింది. లోనికి వెళ్లడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా వీలు కాలేదు. వారిని కాపాడేందుకు తగిన వాతావరణం లేదు.

ఇదిలావుంటే, అంతకు ముందు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్కేంద్రంలో గురువారం అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంటల్లో 9 మంది చిక్కుకున్నట్లు విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రమాదం జరిగిన ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, తదితరులు అక్కడికి చేరుకున్నారు. 

షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. తొలుత నాలుగో యూనిట్ టెర్మినల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి శబ్దాలొచ్చినట్లు తెలుస్తోంది.మొత్తం ఆరు యూనిట్లలో కూడా పొగలు కమ్ముకున్నాయి. కరెంట్ ఉత్పత్రి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. చిమ్మచీకటి అలుముకుంది.  పొగలు రావడాన్ని గుర్తించిన డీఈ పవన్ కుమార్ తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయిటెనెన్స్ సిబ్బంది కొందరు వెటనే బయటకు పరుగులు తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios