Asianet News TeluguAsianet News Telugu

మూలికా వైద్యం ఫార్ములా పేరుతో వైద్యురాలికి 42 లక్షలు టోకరా.. నిందితుడు నైజీరియనే... !

మెస్సి డాన్ హో (34) నైజీరియా లో సరైన ఉపాధి అవకాశాలు లేక మూడేళ్లక్రితం వ్యాపార పాస్ పోర్ట్ తో ఢిల్లీ కి వచ్చాడు. ఇంటర్నెట్ మోసాలు చేసేందుకు పోలీసులకు అనుమానం రాకుండా మోహన్ గార్డెన్స్ లో ఓ చిన్న బేకరీ, కూల్డ్రింక్స్ దుకాణాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించాడు.

Nigerian man dupes Hyderabad doctor of Rs 41 lakh, arrested - bsb
Author
Hyderabad, First Published Jul 14, 2021, 10:03 AM IST

మూలికావైద్యం సూత్రాలు (ఫార్ములా) విక్రయిస్తే రూ. 5 కోట్లు ఇస్తానంటూ వైద్యురాలి నుంచి రూ. 42 లక్షలు కొల్లగొట్టిన నైజీరియన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ లో పట్టుకున్నారు.  పదిహేను రోజుల పాటు సాంకేతిక ఆధారాలు, బ్యాంకు ఖాతాలు, చిరునామాలు పరిశోధించి ఈ నేరానికి పాల్పడింది ఢిల్లీలో ఉంటున్న మేస్సీ డాన్ హో గా గుర్తించారు.  

ఇద్దరు పోలీసు అధికారులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మోహన్ గార్డెన్ పోలీస్ ఠాణా పరిధిలో ఉంటున్న డాన్ హోను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద నుంచి 37 ఏటీఎం కార్డులు, 12 పాస్ పుస్తకాలు, 13 చెక్కు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 

మెస్సి డాన్ హో (34) నైజీరియా లో సరైన ఉపాధి అవకాశాలు లేక మూడేళ్లక్రితం వ్యాపార పాస్ పోర్ట్ తో ఢిల్లీ కి వచ్చాడు. ఇంటర్నెట్ మోసాలు చేసేందుకు పోలీసులకు అనుమానం రాకుండా మోహన్ గార్డెన్స్ లో ఓ చిన్న బేకరీ, కూల్డ్రింక్స్ దుకాణాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించాడు.

కరోనా నేపథ్యంలో మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, పరికరాలకు గిరాకీ ఉందని తెలుసుకున్నడాన్ హో... వైద్యులు, ఫార్మా కంపెనీల వారికి ఫోన్లు చేసి ఆ పరికరాలు తక్కువ ఖర్చుకు ఇప్పిస్తానని నగదు బదిలీ చేయించుకుని మోసం చేశాడు.

ఈ క్రమంలోనే మెహదీపట్నంలో ఉంటున్న వైద్యురాలి కి 20 రోజుల క్రితం ఫోన్ చేసిన మేస్సీ తనను లండన్ లో ఉంటున్న వైద్య నిపుణుడిగా పరిచయం చేసుకున్నాడు. వైద్యురాలు తయారుచేస్తున్న మూలికల ఫార్ములా విక్రయిస్తే ఐదు కోట్లు ఇస్తానని చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయానికి పార్సిల్ పంపించానని, అందులో పౌండ్లు ఉన్నాయని నమ్మించాడు.

ఆర్బిఐ పన్ను, కస్టమ్స్ సుంకాల పేరుతో 42 లక్షల రూపాయలు కొట్టేసిన మేస్సీ.. తాను ఢిల్లీకి తెచ్చిన పౌండ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఈ లోపు తన కూతురు చనిపోయిందని వైద్యురాలికి చెప్పాడు. తిరిగి లండన్ వెళ్లేందుకురూ. 20,000 రూపాయలు కావాలంటూ అడగగా ఆమె డబ్బు పంపింది.

తర్వాత మెస్సీ ఫోన్ స్విచాఫ్ చేశాడు. మరోవైపు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పాస్పోర్టు గడువు పూర్తికావడంతో గతేడాది అక్టోబర్లో మోహన్ గార్డెన్ ఠాణా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios