Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసు : 11 మందికి పదేళ్ల జైలు శిక్ష , ఎన్ఐఏ కోర్ట్ తుది తీర్పు

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో 11 మంది నిందితులకు పదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ గురువారం తుది తీర్పును వెలువరించింది . హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని భావించిన ఈ గ్యాంగ్ .. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్ధాలు తెచ్చింది.

nia court verdict in hyderabad terror conspiracy case ksp
Author
First Published Oct 26, 2023, 8:34 PM IST | Last Updated Oct 26, 2023, 8:34 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 11 మంది నిందితులకు పదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కుట్ర వెనుక కీలక సూత్రధారి ఉబెర్ ఉర్ రెహమాన్‌తో పాటు మరో 10 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని భావించిన ఈ గ్యాంగ్ .. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్ధాలు తెచ్చింది. అయితే దీనిని ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైల్లో వున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios