దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఆదివారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు వున్నట్లుగా అనుమానిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేసింది. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఆదివారం దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు వున్నట్లుగా అనుమానిస్తున్న వారి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక పదాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అలాగే కర్ణాటకలోని భత్కల్‌లో ఓ వ్యక్తిని ఈ దాడుల్లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

ALso REad:ఏపీలో ఎన్ఐఏ సోదాలు ... దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య ఇంట్లో తనిఖీ

కేరళలోనూ పోలీసులపై హత్యాయత్నం చేసిన సతిక్ బచ్చాకు సంబంధించిన కేసులో దాడులు చేపట్టింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎన్ఐఏ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. స్థానిక జిరాయత్ నగర్‌లో నసీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పాపులర్ ఫ్రంట్ ఇండియా కేసులో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లుగా సమాచారం.