Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను జైలుకు పంపాలా?:రాయలసీమ లిఫ్ట్‌పై ఎన్జీటీ సంచలనం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా అర్హమౌతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి తెలంగాణ పంపిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలించింది.ఈ సందర్భంగా కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడిందని అభిప్రాయపడింది ట్రిబ్యునల్
 

NGT sensational comments on Rayalaseema lift irrigation project
Author
Hyderabad, First Published Aug 16, 2021, 2:41 PM IST


చెన్నై: కోర్టు ఆదేశాలను ధిక్కరించి  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టినట్టుగా అర్ధమౌతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎన్జీటీలో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫోటోలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది

also read:రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కేఆర్ఎంబీ నివేదిక సిద్ధం, సర్వత్రా ఉత్కంఠ

.ఈ ఫోటోలను ఎన్జీటీ పరిశీలించింది.ఈ ఫోటోలను చూస్తే పెద్ద ఎత్తున పనులు జరిగినట్టుగా అర్ధమౌతోందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అంతేకాదు కోర్టు ధిక్కరణకు కూడా ఏపీ ప్రభుత్వం పాల్పడిందని అర్ధమౌతోందన్నారు.

 

కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను గతంలో జైలుకు పంపారా అని ఎన్జీటీ ప్రశ్నించింది. అధికారులను నేరుగా జైలుకు పంపవచ్చా  లేదా హైకోర్టు ద్వారా .జైలుకు పంపాలా అని పిటిషనర్ల అభిప్రాయాన్ని ఎన్జీటీ కోరింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది.తమ ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను గతంలోనే హెచ్చరించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలించి  తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరించినట్టుగా అర్హమౌతోందోనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది

Follow Us:
Download App:
  • android
  • ios