న్నతల్లి వేధింపులు భరించలేక ఓ కొత్తగా పెళ్లైన జంట ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఆ జంట మృత్యువును కౌగిలించుకుంది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కోటగిరి మండల కేంద్రంలోని సాయి ప్రణీత్ (22), ఆయన భార్య విజయ (18) ఇద్దరూ పెళ్లి అయిన పదిహేను రోజులకే ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇది గమనించిన స్థానికులు వీరినిజిల్లా ప్రభుత్వ​ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ భర్త సాయి ప్రణీత్‌ మృతి చెందాడు. భార్య విజయ పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా తమ చావుకు తన అమ్మే కారణమని ప్రణీత్, విజయ‌ సుసైడ్‌ లెటర్‌ రాశారు. ఈ లేఖలో.. తను పెట్టే బాధలు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నట్లు వెల్లడించారు. 

‘పెళ్లి అయినప్పటి నుంచి వేధింపులకు గురిచేస్తోంది. నాతోపాటు నా భార్యను కూడా ఇబ్బందులు పెడుతోంది. అత్తమామలు కూడా మా తల్లిదండ్రులపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. విజయను కొడుతున్నారు. మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను. ఇంకో జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’. అని ప్రణీత్,‌ విజయ‌ లేఖలో పేర్కొన్నారు.