ఆ ప్రేమికుల జంట తమ ప్రేమను పదిలం చేసుకోవడానికి ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. కానీ, రెండు నెలలు కూడా నిండకముందే వారి ప్రేమలో విషాదం నెలకొంది. ఆ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

హైదరాబాద్: ప్రేమ సృష్టిలో అద్భుతమైన అనుభవం అని, దాన్ని మాటల్లో వర్ణించలేమని ప్రేమికులు గొప్పలుపోతారు. అందుకే ఎంత కష్టం వచ్చిన ఎదురీది మరీ ఒక్కటవుతుంటారు. కానీ, ఖమ్మంలో ఇటీవలే love marriage చేసుకున్న నూతన దంపతులు తమ ప్రేమను జీవితాంతం నిలుపుకోలేకపోయారు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ, రెండు నెలలు తిరుగకముందే నవ వధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Khammam రూరల్ మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది.

గుదిమళ్ల పంచాయతీ పరిధిలోని నంద్యా తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ తండాకు చెందిన ధరావత్ శైలజా, అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఓ పోరాటమే చేశారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లుచేసుకున్నారు. ఆగస్టు నెలలోనే వీరిద్దరు ఒక్కటయ్యారు.

దురదృష్టకరమేమిటంటే, పెళ్లి జరిగిన తర్వాత వారి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. అభిప్రాయ బేధాలు, విభేదాలు మొదలయ్యాయి. ఈ గొడవలపై శైలజా తరుచూ బాధపడేది. వీటి వల్లే ఆమె తీవ్ర మనస్థాపం చెంది తాను ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

బుధవారం రోజు రాత్రి ఇంట్లో అందరూ గాఢ నిద్రలోనే ఉన్నప్పుడు ఆమె ఆత్మహత్యకు సంకల్పించింది. ఎవరికీ తెలియకుండా fanకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత కొంత కాలానికి తల్లిదండ్రులు వెంటనే శైలజాను రక్షించడానికి సకల ప్రయత్నాలు చేశారు. కానీ, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ bride శైలజా అప్పటికే మరణించింది.

ఘటనా వివరాలు తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్టు పోలీసులు తెలిపారు.