తెలంగాణ ఈఎస్ఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99 కోట్లును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ, తమిళనాడులోని చిట్‌ఫండ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు దేవికా రాణి ఆమె కుటుంబసభ్యులు.  

ప్రతి నెలా చిట్‌ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు చిట్‌ఫండ్ కంపెనీ నుంచి రూ.1.99 కోట్ల డీడీనీ స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే దేవికా రాణి రియల్ ఎస్టేట్ పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ‌లో పెట్టిన రూ.4.47 కోట్లతో పాటు రూ.2.29 కోట్లు డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.