వనపర్తిలో దారుణహత్యకు గురైన సాయిప్రియ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆమెను మాట్లాడుకుందామని హైదరాబాద్ నుంచి వనపర్తికి పిలిపించి శ్రీశైలం అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. 

వనపర్తిలో దారుణహత్యకు గురైన సాయిప్రియ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమోన్మాది శ్రీశైలం ఆమెపై అత్యాచారానికి తెగబడినట్లుగా కథనాలు వస్తున్నాయి. తనను వివాహం చేసుకోవాలని శ్రీశైలం ఆమెను కొన్నాళ్లుగా వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు భరించలేక శ్రీశైలం ఫోన్ నెంబర్‌ను దాదాపు 6 నెలల పాటు బ్లాక్ చేసింది సాయిప్రియ. దీంతో స్నాప్ చాట్‌లో చాటింగ్ ద్వారా సాయిప్రియను వేధించాడు శ్రీశైలం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఒకసారి కలుద్దామని చెప్పి వనపర్తికి రప్పించాడు శ్రీశైలం. దీంతో వనపర్తికి వెళ్లిన సాయిప్రియతో దాదాపు 2 గంటల పాటు మాట్లాడాడు శ్రీశైలం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నానని ఆమె చెప్పింది... అయితే తనను పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్లొచ్చని బలవంతం చేశాడు శ్రీశైలం. అయితే అతనిని పెళ్లి చేసుకునేందుకు సాయిప్రియ నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతను ఆమె చున్నీతోనే ఉరివేసి హత్య చేశాడు. అనంతరం బావమరిదితో కలిసి సాయిప్రియ మృతదేహాన్ని పాతిపెట్టాడు శ్రీశైలం. ఈ క్రమంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ALso Read:సాయిప్రియ హత్య కేసులో ట్విస్ట్.. స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్, ఆపై వనపర్తికి రప్పించి

ఇకపోతే.. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమైంది. తనను వివాహం చేసుకోవాలని సాయిప్రియపై శ్రీశైలం ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఆమె ససేమిరా అనడంతోనే సాయిప్రియను హతమార్చాడు. అనంతరం వనపర్తి సమీపంలో సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చివరికి వనపర్తిలో సాయిప్రియ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు.