ఘట్‌కేసర్‌లో ఆత్మహత్య చేసుకున్న బీ ఫార్మసీ విద్యార్ధిని మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. అయితే ఆమె బలవన్మరణానికి సంబంధించి క్లారిటీ రాలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద  మృతి కేసుగా నమోదు చేశారు.

కాగా, ఆమెను ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులు నిన్న గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో మృతురాలు వారం రోజులుగా ఆహారం తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఆమె మరణంపై పోస్ట్‌మార్టం నివేదికలోనూ స్పష్టత రాలేదు. 

తనను కిడ్పాప్ చేసి ఆటో డ్రైవర్లు తనపై వాహనంలో అత్యాచారం చేశారని కట్టుకథ అల్లిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఘట్కేసర్ లో తనను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని, ఆ తర్వాత మరో ముగ్గురితో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఓ యువతి కట్టుకథ అల్లిన విషయం తెలిసిందే. ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Also Read:ఘట్కేసర్ కిడ్పాప్, రేప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

యువతి చెప్పిన విషయాలన్నీ కట్టుకథలని పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, శాస్త్రియమైన విశ్లేషణలు చేసి యువతి కట్టుకథ అల్లిందని, ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన విద్యార్థిని కాలేజీ నుంచి తిరిగి వచ్చే సమయంలో తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుని వెళ్లాడని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో యువతి తల్లి 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సెల్ ఫోన్ సంకేతాల ఆధారంగా అన్వేషణ ప్రారంభించి యువతిని కనిపెట్టారు. 

ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు. వారికి రాచకొండ సీపీ మహేష్ భగవత్ సారీ కూడా చెప్పారు. అత్యాచారం ఎక్కడ జరిగిందనే విషయం గురించి యువతి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి మాత్రమే యువతి కిడ్పాన్, అత్యాచారం కథ అల్లిందని పోలీసులు గుర్తించారు.