Asianet News TeluguAsianet News Telugu

ఎర్రగడ్డ హస్పిటల్ రేప్ కేసులో ట్విస్ట్... బ్లడ్ టెస్టింగ్ గదిలోనూ నీచుడి కీచకపర్వం..!

హైదరాబాద్ నడిబొడ్డున ఎప్పుడూ పేషెంట్స్, సహాయకులతో రద్దీగా వుండే ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్లో ఓ బాలికపై అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. 

New twist in Erragadda ESI Hospital rape case AKP
Author
First Published Sep 18, 2023, 10:00 AM IST

హైదరాబాద్ : గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోదరుడికి సహాయకురాలిగా వున్న బాలికపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం హైదరాబాద్ లో వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్పిటల్లోనే పనిచేసే యువకుడు బాలికపై కన్నేసి గత శనివారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే తనపై ఒక్కసారి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక చెబుతోంది.  

ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఓ వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. అతడికి సహాయకురాలిగా  19ఏళ్ళ సోదరి అక్కడే వుంటోంది. ఇలా ఒంటరిగా వుంటున్న బాలికపై అదే హాస్పిటల్లో పనిచేసే అజయ్ అనే యువకుడు కన్నేసాడు. తనను సెక్యూరిటీ గార్డుగా పరిచయం చేసుకుని యువతికి సహాయం చేస్తూ  మంచివాడిలా నటించాడు. దీంతో అతడిని యువతి పూర్తిగా నమ్మింది. 

గత శుక్రవారం రాత్రి చికిత్స పొందుతున్న సోదరుడికి ఆహారం కోసం ఐదో అంతస్తు నుండి గ్రౌండ్ ప్లోర్ లోని క్యాంటిన్ కు వెళ్లింది యువతి. ఈ క్రమంలోనే అప్పటికే పరిచయమున్న అజయ్ కనిపించడంతో ఇద్దరూ పలకరించుకున్నారు. ఏ సహాయం కావాలన్న తనను అడగాలంటూ యువతికి సూచించాడు. ఇలా మట్లాడుకుంటూ లిప్ట్ వరకు వెళ్లి ఇద్దరూ కలిసి ఐదో ప్లోర్ కి వెళ్లారు. అక్కడి నుండి మాట్లాడేది వుందంటూ యువతిని సెకండ్ ప్లోర్ లో ఖాళీగా వున్న ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ప్రేమిస్తున్నాను... పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతిపై మెళ్లిగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read More  ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..

తనపై అత్యాచారం జరగడంతో ఏడుస్తూ వున్న యువతిని వదిలిపెట్టకుండా రక్త పరీక్షలు చేసే మరో గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా రెండుసార్లు అత్యాచారానికి పాల్పడి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. కానీ బాలిక తన సోదరుడికి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నీచున్ని అరెస్ట్ చేసారు.  

బాధిత యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసి  ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు తెలిపారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios