కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పార్లమెంట్ నూత‌న‌ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ‌లో నిర్మిస్తున్న నూత‌న సచివాలయ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. 

నూత‌నంగా నిర్మిస్తున్న‌ పార్లమెంటు భ‌వానానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నూత‌న‌ పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి పూర్తి మ‌ద్దుతు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

పార్లమెంటు రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కాబట్టి.. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 

పార్లమెంట్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుందని, అందుకే భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న కొత్త అసెంబ్లీ భవనానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Scroll to load tweet…

తెలంగాణ శాసనమండలిలో తీర్మానం

కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం తీర్మానాన్ని తెలంగాణ శాసనమండలి ఉభయ సభలు ప్రవేశపెట్టడం గమనార్హం. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏఐఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హ‌జ‌ర‌య్యారు. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్ పి.శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ప్రకటించారు.