Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ పొడిగింపు.. తెలంగాణలో కొత్త రూల్స్..

కేసులు ఎక్కువగా ఉన్న 139 ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను రెడీ చేసింది. ఈ ప్రాంతాల్ని పూర్తిగా కంట్రోల్‌లో ఉంచబోతోంది. కంటైన్మెంట్ జోన్లకు సర్కిల్, జోనల్ స్థాయిలో నోడల్ బృందాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
New Rules in Telangana Over Coronavirus Lock Down
Author
Hyderabad, First Published Apr 15, 2020, 1:37 PM IST
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం హైదరాబాద్ లో 45శాతానికిపైగా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే సీఎం కేసీఆర్.. లాక్ డౌన్ పొడిగించారు. అయితే.. ఈ పొడిగించిన లాక్ డౌన్ ను మరింత బలంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చారు.

కేసులు ఎక్కువగా ఉన్న 139 ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను రెడీ చేసింది. ఈ ప్రాంతాల్ని పూర్తిగా కంట్రోల్‌లో ఉంచబోతోంది. కంటైన్మెంట్ జోన్లకు సర్కిల్, జోనల్ స్థాయిలో నోడల్ బృందాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

ఆ ప్రకటనలో...రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో దారుల్ని 8 అడుగుల ఎత్తుండే బారికేడ్లతో మూయాలి. ఈ జోన్లలోకి వెళ్లి, వచ్చేందుకు ఒకటే రూట్ ఉండాలి. జోన్లను 24 గంటలూ పోలీసులు పర్యవేక్షించాలి. జోన్లలో వాళ్లు బయటకు రాకూడదు. బయటి వాళ్లు లోపలికి వెళ్లకూడదు. పోలీసుల్లో ఏఎస్సై లేదా ఎస్సై లేదా సీఐ స్థాయి ఆఫీసర్ పర్యవేక్షించాలి. జోన్లలో ఉండేవారికి నిత్యవసరాలు అందించేందుకు ఓ నోడల్ ఆఫీసర్, శానిటైజేషన్ కార్యక్రమాలకు మరో ఆఫీసర్ ఉండాలి. అలాగే ఓ బిల్ కలెక్టర్ ఉంటారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి.. నిత్యవసరాలు ఇస్తారు. మాస్కులు కూడా ఇస్తారు.

కాగా.. ఈ కంటైన్మెంట్ జోన్లలో రోజూ శానిటేషన్ (శుభ్రత-పరిశుభ్రత) ఉంటుంది. రోజుకు రెండుసార్లు… సూక్ష్మక్రిములను చంపే రసాయానాల్ని పిచికారీ చేస్తారు. ఈ పని అధికారులు మాత్రమే చేస్తారు. ప్రజలు చెయ్యకూడదు.కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజూ ఫీవర్ సర్వే ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాజిటివ్ అని తేలితే… వారిని ఐసోలేషన్‌కి తరలించి… వారి కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్క వారిని క్వారంటైన్‌కి తరలిస్తారు. వారి చేతిపై క్వారంటైన్ ప్రింట్ (వేస్తారు.
Follow Us:
Download App:
  • android
  • ios