Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాజకీయ రణరంగంలోకి మరో కొత్త పార్టీ .. కాంగ్రెస్ నేత అడుగులు

తెలంగాణ (telangana) రాజకీయ రణరంగంలోకి మరో కొత్త పార్టీ (new political party) ఆవిర్భవించనున్నట్లు సమాచారం . డాక్టర్ వినయ్ (dr vinay kumar) నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది.

new political party to come in telangana
Author
Hyderabad, First Published Oct 27, 2021, 4:03 PM IST

తెలంగాణ (telangana) రాజకీయ రణరంగంలోకి మరో కొత్త పార్టీ (new political party) ఆవిర్భవించనున్నట్లు సమాచారం . డాక్టర్ వినయ్ (dr vinay kumar) నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో తన మద్దతు దారులతో డాక్టర్‌ వినయ్ బుధవారం భేటీ అయ్యారు. ఎందరో త్యాగాలు, ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరికి న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వినయ్‌ కుమార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు.

మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ (ex minister shivsanker) తనయుడే డాక్టర్ వినయ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వినయ్ కుమార్‌.. ఇవాళ సాయంత్రం ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం….. కొత్త పార్టీ ఏర్పాటు చేయడంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ లో కొత్త పార్టీ పేరు‌ను ప్రకటించాలని డాక్టర్ వినయ్ కుమార్ అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీ, సీపీఐ, సీపీఎం, ఆప్ వున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలుగా టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్‌టీపీ, తెలంగాణ జన సమితి వున్నాయి. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhara reddy) కుమార్తె, షర్మిల (ys sharmila) ఇటీవల వైఎస్సార్ తెలంగాణ పార్టీని (ysr telangana party) ఆమె స్థాపించారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను షర్మిల తీవ్రంగా కష్టపడుతున్నారు. తాజాగా ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర (sharmila padayatra) ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios