కట్టుకున్న భర్తే ఆమెను చంపేశాడు. సదరు యువతికి ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్త గంగాధర్ తో ఆదివారం అర్థ రాత్రి సమయంలో.. గొడవ జరిగింది.

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. సనత్ నగర్ పరిధిలోని భరత్ నగర్ లో ఓ నవ వధువు హత్యకు గురైంది. ఆమెను గొంతు నులిమి అతి దారుణంగా చంపేయడం గమనార్హం. కట్టుకున్న భర్తే ఆమెను చంపేశాడు. సదరు యువతికి ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్త గంగాధర్ తో ఆదివారం అర్థ రాత్రి సమయంలో.. గొడవ జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ గొడవ కాస్త ఘర్షణకు దారి తీయగా.. ఆవేశంలో గంగాధర్.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.