సంగారెడ్డి జిల్లాలో శిశువు అదృశ్యమైన ఘటనను మరచిపోకముందే ఆసిఫాబాద్ జిల్లాలో మరో దారుణం జరిగింది. నిండు గర్భిణీకి నర్సులే పురుడు పోయడంతో శిశువు మరణించాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వైద్యులు లేకపోవడం వల్లే స్టాఫ్ నర్సులే పురుడు పోశారని... ఉదయం 5.30 గంటల సమయంలో బాబు పుట్టగా.. మృతి చెందాడని చెప్పారని తెలిపారు. మధ్యలో ఏదో గందరగోళం జరితగతింది.. వైద్యులు లేకపోవడం వల్లే బిడ్డ మరణించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.