బీజేపీVsటీఆర్ఎస్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లితో పాటు కొడుకుపై కేసు
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా ఆయన కొడుకు రోహిత్ పై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్పోరేటర్ సునీతశేఖర్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కొడుకు రోహిత్ పై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.మల్కాజిగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆదివారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో బీజేపీ కార్పోరేటర్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. ఈ విషయమై ఈ నియోజకవర్గంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య సోమవారం నాడు కూడ ఘర్షణ చోటు చేసుకొంది.
also read:నన్ను యూజ్‌లెస్ ఫెలో అంటావా, నీ గుండు పగులుద్ది.. బండి సంజయ్‌కి మైనంపల్లి వార్నింగ్
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ సమయంలో ఎమ్మెల్యే సహా టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడికి దిగారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనలో మౌలాలి కార్పోరేటర్ కారు ధ్వంసమైంది. ఇరువర్గాల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకొంది.
ఈ ఘటనపై మౌలాలి కార్పోరేటర్ సునీత శేఖర్ యాదవ్ నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనంపల్లి హన్మంతరావుపై 324, 427, 504, 506, 148 ఆర్/డబ్ల్యు, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరో వైపు మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.