Asianet News TeluguAsianet News Telugu

నీట్ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా

రాష్ట్రానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టాప్‌-50 ర్యాంకులో ఉన్నారు.  రాష్ర్టం నుంచి మొత్తం 54,872 మంది అభ్య‌ర్థులు నీట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,392 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. 
 

NEET Results 2020: Two students from Telugu states of Telangana and Andhra figure among Top 10
Author
Hyderabad, First Published Oct 17, 2020, 9:42 AM IST

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష( నీట్ 2020) ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. నీట్ ఫలితాలను శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. దేశ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి.. తెలంగాణ రాష్ట్ర కీర్తిని చాటింది.

హైద‌రాబాద్‌కు చెందిన తుమ్మ‌ల స్నితిక అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకును సాధించింది. అమ్మాయిల కేట‌గిరిలో రెండ‌వ ర్యాంకు. 720 మార్కుల‌కు గాను 715 మార్కులు వ‌చ్చాయి. మ‌రో తెలంగాణ విద్యార్థి అనంత ప‌రాక్ర‌మ బి నూక‌ల 710 మార్కులు సాధించి ఆలిండియా 11వ ర్యాంకును ద‌క్కించుకున్నారు. 

రాష్ట్రానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టాప్‌-50 ర్యాంకులో ఉన్నారు.  రాష్ర్టం నుంచి మొత్తం 54,872 మంది అభ్య‌ర్థులు నీట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,392 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. 

కాగా దేశ‌వ్యాప్తంగా నీట్‌కు 15,97,435 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,66,945 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. జాతీయ‌స్థాయిలో ఒడిశా విద్యార్థి సోహెబ్ అఫ్తాబ్ ఆలిండియా టాప‌ర్‌గా నిలిచాడు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో సోహెబ్ అఫ్తాబ్ 99.99 శాతం మార్కుల‌ను సాధించాడు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నీట్ 2020 గత నెల 13న నిర్వహించారు. కోవిడ్ బాధితుల కోసం ఈ నెల 14న మరోసారి పరీక్ష నిర్వహించడం గమనార్హం. కాగా ఫలితాలను మాత్రం శుక్రవారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. సాంకేతిక సమస్యల కారణంగా ఫలితాలు రాత్రి 8గంటల వరకు వెలువడకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్  మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్య కాళాశాలల నుంచి సేకరించిన 15శాతం ఎంబీబీఎస్ సీట్లతో నిర్వహించనున్న అఖిల భారత వైద్య విద్య సీట్ల కూటమి ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రవేశాల కంటే ముందుగానే నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిల భారత కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లను అందజేస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత ప్రవేశాల సమాచారం కోసం అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో నిర్వహించే కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కాలేజీల్లో 4,915 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios