నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో సినీ నటుడు శివాజీకి చుక్కెదురైంది. అలందా మాడియాకు అనుకూలంగా ఎన్‌సీఎల్‌టీ గురువారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది.
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో సినీ నటుడు శివాజీకి చుక్కెదురైంది. అలందా మాడియాకు అనుకూలంగా ఎన్‌సీఎల్‌టీ గురువారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది.
ఏబీసీఎస్‌లో జరిగిన మార్పులు,చేర్పులు తనకు తెలియకుండా రవిప్రకాష్ మోసపూరితంగా వ్యవహరించారని.. ఏబీసీఎల్‌లో మార్పులపై స్టే విధించి యధాతథస్థితిని కొనసాగించాలంటూ ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జరపలేమని ఎన్‌సీఎల్‌టీ తేల్చి చెప్పింది
ఇదిలా ఉంటే అలందా మీడియా ఒప్పందాలపై స్టే విధించాలని కోరుతూ రవిప్రకాష్ కూడ వారం రోజుల క్రితంఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ట్రిబ్యునల్ ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ అలందా మీడియా సంస్థ కూడ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ కేసు విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. హైద్రాబాద్ ఎన్‌సీఎల్‌టీ లో జరిగే కేసు విచారణపై జూలై 9వరకు స్టే ఇచ్చింది.
ఈ స్టే కారణంగా జూలై 12 వరకు ఎలాంటి ప్రోసిడింగ్స్ జరగడానికి వీల్లేదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది.ఈ మేరకు కేసు విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు రవిప్రకాష్, సినీ నటుడు శివాజీలు కూడ హాజరుకాలేదు. ఈ ఇద్దరి తరపున న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated May 16, 2019, 4:04 PM IST