హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొత్త పేరు పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదని గడ్డం కుమార్ రెడ్డి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనంటున్న ఉత్తమ్ ఇకపై ఎప్పటికీ గడ్డంతోనే ఉంటాడన్నారు.

 తాము అధికారంలోకి వచ్చాక ఆఫీసర్ల పని పడతామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులను బెదిరించి అదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తే అది సాధ్యం కాదన్నారు. 

దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీసులంటూ కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసులు వాళ్లపని వాళ్లు చేస్తున్నారని అనవసరంగా విమర్శలు చేయొద్దని ఉత్తమ్‌కు హితవు పలికారు. కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నాయిని విశ్వాసం వ్యక్తం చేశారు.