హైదరాబాద్: తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. చికిత్స ఆయన స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ సోకడంతో ఆయన సెప్టెంబర్ 30వ తేీదన అపోలో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ శ్వాసకోశ సమంబంధమైన సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీల్లో పోటాషియం స్థాయిలు పెరిగాయని, ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు మంగళవారం చెప్పారు. 

నాయిని నర్సింహా రెడ్డిని మంగళవారంనాడు, సోమవారంనాడు మంత్రులు పరామర్శించారు. కెటీ రామారావు, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కరోనా సోకడానికి ముందు ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరి వారం రోజులకు పైగానే అవుతోంది. నాయిని భార్యకు, అల్లుడికి, మనవడికి ఇటీవల కరోనా వైరస్ సోకింది.