Asianet News TeluguAsianet News Telugu

నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం విషమం: భార్య, అల్లుడు, మనవళ్లకు కరోనా

తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Nayini Narsimha Reddy health condition critical
Author
Hyderabad, First Published Oct 16, 2020, 6:51 AM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయన ప్రస్తుతం హైదరాబాదులని జూబ్లీహిల్స్ లో గల అపోలో ఆస్పత్రి అడ్వాన్స్ డ్ క్రిటికిల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు 

గత నెల 28వ తేదీన కరోనా సోకిన నాయని నర్సింహారెడ్డి సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స చేరి 16 రోజుల పాటు చికిత్స చేయించుకున్నారు. వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. 

దాంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యూమోనియా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో నాయని నర్సింహా రెడ్డి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. దాంతో ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 

ఇదిలావుంటే, నాయని నర్సింహా రెడ్డి సతీమణి అహల్యకు కరోనా సోకింది. ఆమె సైతం బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు నెగెటివ్ వచ్చింది. అయితే మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. నాయని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పోరేటర్ వి. శ్రీనివాస రెడ్డికి, ఆయన పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి కోలుకుంటున్నాుర. 

Follow Us:
Download App:
  • android
  • ios