కారణమిదీ:వికారాబాద్లో పుట్టిన రోజుకు బంధువులను పిలిచి దాడి
కొడుకు పుట్టిన రోజున బంధువులను పిలిచి దాడికి దిగాడు నవీన్ అనే వ్యక్తి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
హైదరాబాద్: కొడుకు పుట్టిన రోజుకు బందువులను పిలిచి దాడికి దిగాడు నవీన్ అనే వ్యక్తి. మద్యం మత్తులో నవీన్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారంనాడు రాత్రి జరిగింది.
వికారాబాద్ జిల్లాలోని అత్తిలి గ్రామానికి చెందిన నవీన్ తన కొడుకు పుట్టిన రోజును పురస్కరించుకొని బంధువులకు పిలిచాడు. బర్త్ డే వేడుకల సందర్భంగా బంధువులకు పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ సమయంలో నవీన్ కూడా మద్యం సేవించాడు. ఈ సమయంలో కారు ఇవ్వాలని నవీన్ బంధువును కోరాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు ఇచ్చేందుకు బంధువు నిరాకరించాడు. దీంతో నవీన్ ఆగ్రహం పట్టలేకపోయాడు. పుట్టిన రోజు ఫంక్షన్ కు వచ్చిన బంధువులను గదిలో బంధించి చితకబాదాడు. ఈ ఘటనతో బంధువులు షాక్ కు గురయ్యారు. వెంటనే వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గదిలో బంధించిన బంధువులను పోలీసులు విడిపించారు. నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.