హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొంది... పెళ్లైన ఆరు మాసాలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కొల్చారంలో చోటు చేసుకొంది. చనిపోయే ముందు మృతురాలు సూసైడ్ నోట్ రాసింది. ఈ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొల్చారం గ్రామానికి చెందిన లక్ష్మి, చెన్నయ్య దంపతుల కూతురు నవనీత. ఆమె వయస్సు 19 ఏళ్లు. ఇంటర్ పూర్తి చేసింది నవనీత.

ఇదే గ్రామానికి చెందిన ఆశన్నగారి లక్ష్మి, మల్లేశంలు నవనీత కుటుంబానికి దూరపు బంధువులు. వీరికి  ప్రశాంత్ అనే కొడుకు ఉన్నాడు. ప్రశాంత్ ... నవనీతకు వరుసకు బావ అవుతాడు.వీరిద్దరూ రెండేళ్లుగా  ప్రేమించుకొన్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి గొడవలు జరిగాయి.  

అయితే కొన్ని రోజుల తర్వాత నవనీత, ప్రశాంత్ లు రెండు కుటుంబాలను ఒప్పించి ఫిబ్రవరి మాసంలో పెళ్లి చేసుకొన్నారు. అయితే శనివారం నాడు నవనీత ఆత్మహత్య చేసుకొంది. 

ఆత్మహత్యకు ముందు నవనీత సూసైడ్ నోట్ రాసింది.  ఐలవ్ యూ బావా అంటూ ఆమె ఆ లెటర్ లో రాసింది. హాయ్ బావా.... నీకు నేను అంత ఇష్టం లేనట్టు ఉంది.. నాకు ఓడిపోవాలని లేదు... అందుకే చనిపోతున్నాను అని ఆమె ఆ లేఖలో రాసింది.

ఆ తర్వాత నవనీత, ప్రశాంత్ లు అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెప్పారు. అయితే  కట్నం తీసుకురావాలని నవనీతను  అత్తింటివాళ్లు వేధింపులకు గురి చేయడంతో తన కూతురు ఆత్మహత్య  చేసుకొందని మృతురాలి కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.