Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఛాంబర్ కి నట్టికుమార్ రాజీనామా

థియేటర్లు ఓపెన్ అవ్వడంతో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లపై ఆధారపడ్డ కూలీలు ఎంతో సంతోషించారని కానీ పరిశ్రమలోని కొంతమంది పెద్ద నిర్మాతల కారణంగా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకొచ్చారు. 

Natti kumar resigned as Film Chamber secretary
Author
Hyderabad, First Published Dec 12, 2020, 2:00 PM IST

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ జాయింట్ సెక్రటరీ పదవికి నిర్మాత నట్టికుమార్ రాజీనామా చేశారు. అలాగే ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ మేరకు డిసెంబర్ 7న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాసిన ఆయన ఇవాళ మీడియాకు విడుదల చేశారు. 

థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా... కొంతమంది సినీ పెద్దల వల్ల సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదని లేఖలో నట్టి కుమార్ ఆరోపించారు. థియేటర్లు ఓపెన్ అవ్వడంతో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లపై ఆధారపడ్డ కూలీలు ఎంతో సంతోషించారని కానీ పరిశ్రమలోని కొంతమంది పెద్ద నిర్మాతల కారణంగా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకొచ్చారు. 

తనకు తెలిసినంత వరకు సదరు పెద్ద నిర్మాతలు తమ స్వప్రయోజనాల కోసం థియేటర్లను 2021 మార్చి వరకు మూసి ఉంచేలా చూస్తున్నారని తెలిపారు. ఈ కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీటిపై చర్చించాలని ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాసు, సెక్రటరీ దాములను నట్టి కుమార్ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios