Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ఊరట, తెలంగాణకు షాక్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కి ఎన్జీటీ బ్రేక్, పనులు నిలిపివేయాలని ఆదేశం

తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. 

national green tribunal stops palamuru rangareddy lift irrigation project works
Author
New Delhi, First Published Oct 29, 2021, 11:21 AM IST

తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టొద్దని ఎన్జీటీ సూచించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌పై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరిపిన ఎన్‌జీటీ ఈమేరకు తీర్పు వెలువరించింది. 

ఇకపోతే పాలమూరు రంగారెడ్డి లిప్ట్  ప్రాజెక్టుపై ఏపీకి చెందిన రైతులు జూలై 15న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పనుల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. పాత అనుమతులతోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్మిస్తోందని ఆ పిటిషన్ లో  రైతులు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొనే వరకు తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే వరకు  తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనుల పరిశీలన కోసం  ఓ కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 

ALso Read:palamuru Rangareddy lift irrigation:పర్యావరణ, ఫారెస్ట్ శాఖలపై ఎన్జీటీ ఆగ్రహం

దీనితో పాటు ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులకు సంబంధించి సెప్టెంబర్ 27న జరిగిన విచారణ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై (palamuru Rangareddy lift irrigation) పర్యావరణ, అటవీశాఖల వ్యవహరశైలిపై ఎన్జీటీ (national green tribunal) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.చర్యలకు ఆదేశించే వరకు అధికారుల్లో కదలిక ఎందుకు రాలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టుపై ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును (krmb) ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.అటవీ, పర్యావరణ శాఖలకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా నది (krishna river) జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని ఏపీ సర్కార్ వాదిస్తోంది. అయితే  తమ రాష్ట్రానికి దక్కాల్సిన  వాటా మేరకు నీటిని వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలంగాణ (telangana govt) చెబుతుంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును (rayalaseema lift irrigation project) తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios