తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఎన్జీటీ చెన్నై బెంచ్ సీరియస్ అయింది.
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఎన్జీటీ చెన్నై బెంచ్ సీరియస్ అయింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపడుతుందని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ ధర్మాసం.. రెండు ప్రాజెక్టుల పూర్తి వ్యవయంలో 1.5 శాతం జరిమానా విధించింది. దీంతో రూ. 900 కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించినట్టయింది. ఈ జరిమానా మొత్తాన్ని కేఆర్‌ఎంబీ వద్ద జమ చేయాలని తెలిపింది. తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. పట్టిసీమ, పురుషోత్తమపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఈ విషయంలో కూడా అమలు చేయాలని తెలిపింది.
