హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ పెన్షన్ దారులు, కుటుంబ పెన్షన్ దారుల పింఛన్ సమస్యలపై జాతీయ పెన్షన్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పెన్షన్ దారులు పరిష్కరించుకున్నారు.

కవాడిగూడలోని ప్రధాన సంచార లేఖ నియంత్రణఅధికారి కార్యాలయంలో జరిగిన ఈ జాతీయ పెన్షన్ అదాలత్ కార్యక్రమానికి ప్రధాన సంచారలేఖ నియంత్రణ అధికారి శ్రీకాంత్ పాండా, లేఖ నియంత్రణ అధికారి ఎం అనితలు పాల్గొన్నారు. 

బీఎస్ఎన్ఎల్ పింఛన్ దారులు, కుటుంబ పెన్షన్ దారులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఈ జాతీయ పెన్షన్ అదాలత్ కార్యక్రమానికి లేఖా అధికారిణి కృష్ణవేణి, కన్సల్టెంట్ ఇక్బాల్ లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ అదాలత్ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు, బీఎస్ఎన్ ఎల్ విభాగ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంపన్ణ్ పించన్ సాఫ్ట్ వేర్ పై జితేందర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టల్ శాఖ నుంచి స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన మార్కెటింగ్అధికారులతో పించన్ దారులకు, ఇతర అధికారులకు పెట్టుబడులు, ఇతర సేవింగ్స్ గురించి అవగాన సదస్సు సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎస్వీ కే నాయక్, పృథ్వీరాజ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు. జాతీయ పెన్షన్ అదాలత్ విజయవంతం కావడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.