హైదరాబాద్: టిక్ టాక్  వీడియో చేస్తూ ప్రమాదవశాత్తు నర్సింహులు చెరువులో పడి గురువారం నాడు మృతి చెందాడు.  కొంపల్లిలోని దూలపల్లి వద్ద ఉన్న చెరువులో ప్రశాంత్, నర్సింహులు టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తున్న సమయంలో  నర్సింహులు చెరువులో పడ్డాడు.  నర్సింహులుకు ఈత రాదు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన నర్సింహులు, ప్రశాంత్ ఇద్దరూ వరుసకు సోదరులు.  టిక్ టాక్ లో వెరైటీ వీడియో తయారు చేయాలని ప్రయత్నించారు. ఈ  మేరకు దూలపల్లి చెరువులోకి దిగారు.  వీడియోను రికార్డు చేస్తున్న సమయంలో  నర్సింహులు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు.

నర్సింహులుకు ఈత రాదు. అతడిని కాపాడేందుకు ప్రశాంత్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే ప్రశాంత్ స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చేవరకు నర్సింహులు చనిపోయాడు.