ప్రమాదానికి గురైన వరంగల్ కమీషనర్... సిపి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 31, Aug 2018, 12:59 PM IST
Narrow escape for Warangal commissioner of police
Highlights

వరంగల్ పోలీస్ కమీషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం మెదక్ జిల్లా తుప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం నుండి కమీషనర్ సురక్షితంగా బైటపడ్డారు. అయితే ఆయన బందువొకరు ఈ ప్రమాదంలో మృతిచెందారు.
 
వివరాల్లోకి వెళితే...వరంగల్ సిపి విశ్వనాథ్ వ్యక్తిగత పనిపై వెళుతుండగా మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టింది. టోల్ ప్లాజా వద్ద ఆగివున్న సిపి కారుతో పాటు ఆయన బంధువుల కారును కూడా లారీ ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం నుండి సిపి సురక్షితంగా బైటపడ్డా ఆయన బంధువైన అనిత అనే మహిళ మృతిచెందారు. అలాగే టోల్ ప్లాజా సిబ్బంది అమిత్ కుమార్ శర్మ, గోవింద్, జయకుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

loader