Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: తెలంగాణ వంటకాలను పరిశీలించిన ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తయారు చేసిన వంటకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన యాదమ్మ నేతృత్వంలో తయారు చేసిన వంటకాల గురించి  ప్రధాని మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు వివరించారు. వంటకాల గురించి మోడీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 

Narendra Modi sees Telangana Food Items In BJP National Executive Meeting
Author
Hyderabad, First Published Jul 3, 2022, 3:57 PM IST

హైదరాబాద్: BJP National Executive  సమావేశాల సందర్భంగా Telangana వంటకాలను ప్రధాన మంత్రి Narendra Modi ఆదివారం నాడు పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల లంచ్ బ్రేక్ ను సందర్భంగా  వంట శాలలో వంటలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ఉమ్మడి Karimnagar జిల్లాకు చెందిన యాదమ్మ ఈ వంటకాలను తయారు చేస్తున్నారు. ఈ వంటకాల గురించి బీజేపీ తెలంగాణ నేతలు నరేంద్ర మోడీకి వివరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శాఖాహరం మాత్రమే ఏర్పాటు చేశారు.  అయితే తెలంగాణ రుచులను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా వండించారు తెలంగాణ రాష్ట్ర నాయకులు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వంటలు చేసేందుకు యాదమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుBandi Sanjay ప్రత్యేకంగా పిలిపించారు. యాదమ్మ నేతృత్వంలోని వంటల బృందం ఈ వంటలను తయారు చేశారు. గతంలో కూడా పలు పార్టీల సమావేశాల్లో యాదమ్మ నేతృత్వంలోని వంటల బృందం వంటలు చేసి పలువురి మన్ననలు పొందారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలు రూపొందించిన  మెనూ ప్రకారంగా వంటలను తయారు చేశారు. ఇవాళ ఉదయం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  Ydammaతో మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం ప్రతినిధులకు తయారు చేసే వంటకాల గురించి చర్చించారు.  బీజేపీ ప్రతినిధులకు టిఫిన్, భోజనాలను యాదమ్మ బృందం తయారు చేసింది.జ

ఈ నెల 2వ తేదీన సాయంత్రం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ 350 మంది ప్రతినిధుల్లో వీఐపీలు, వీవీఐపీలున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లికి చెందిన యాదమ్మ జన్మించింది. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం కొండాపూర్ కు ఉపాధి కోసం వలస వచ్చింది. యాదమ్మకు చిన్నతనంలోనే వివాహమైంది. ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి అయింది. యాదమ్మ వంలు చేయడంలో ప్రావీణ్యం సాధించింది. వెంకన్న అనే వ్యక్తి వద్ద వంటలు చేయడం ఆమె నేర్చుకొంది. చిన్నతనం నుండి వంటలు చేయడంతో ఆమె వంటలు చేయడంలో ప్రావీణ్యం సాధించింది.  వేలాది మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాదమ్మ తన బృందంతో వంటలు చేస్తుంది. నాన్ వెజ్, వెజిటేరియన్  వంటలు చేయనుంది.

బగారా రైస్, సాంబారు, సకినాలు, సర్వ పిండి, పాయసం, పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం,, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, గుత్తి వంకాయ, అరిసెలు  వంటి వటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆమె చేయనుంది.ఈ వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులకు అందించారు.
ఈ నెల 2,3 తేదీల్లో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మ వంటల గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతుంది. ప్రధాని, అమిత్ సహా వంటి ప్రముఖులు యాదమ్మ చేతి వంటను రుచి చూశారు. మోడీకి వంట చేయడం తనకు కలిసి వచ్చిన  అదృష్టంగా ఆమె చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios