కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో  నారాయణ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేశారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

కామారెడ్డి: జిల్లాలోని  బీర్కూర్ మండలం రైతు నగర్ లో  కిరాణాషాపు  నిర్వహిస్తున్న  నారాయణ దంపతులను  గుర్తు తెలియని దుండగులు  మంగళవారంనాడు రాత్రి హత్య చేశారు. దోపీడీ దొంగలు ఈ  హత్యకు  పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నారాయణ  ఇంటి వెనుక వైపు నుండి  ప్రవేశించిన దుండగులు  నారాయణను  కొట్టి చంపారు.  నారాయణ భార్యను ఉరేసి చంపారు.  నారాయణ దంపతులను హత్య చేసింది దొంగలా, ఇతరులా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.