Asianet News TeluguAsianet News Telugu

నారాయణ కాలేజీ ఘటన: మెరుగైన చికిత్స కోసం ముగ్గురు విద్యార్ధులు యశోద ఆసుపత్రికి తరలింపు


హైద్రాబాద్ లోని రామాంత.పూర్ నారాయణ కాలేజీలో గాయపడిన ముగ్గురు విద్యార్ధులను మెగుగైన చికిత్స కోసంయశోద ఆసుపత్రికి తరలించారు. 

Narayana College Students Shiffted To Yashoda Hospital From Gandhi Shospital
Author
Hyderabad, First Published Aug 19, 2022, 4:39 PM IST

హైదరాబాద్:నారాయణ కాలేజీ ఘటనలో గాయపడిన ముగ్గురు విద్యార్ధులను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నగరంలోని రామంతాపూర్ లోని నారాయణ కాలేజీలో జరిగిన ఘటనలో గాయపడిన  ముగ్గురిని గాంధీ ఆసుపత్రి నుండి యశోద ఆసుపత్రికి తరలించారు.ఆ తర్వాత వారిని డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు.

కాలేజీ ఫీజు చెల్లించకపోవడంతో  టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఇదే విసయమై కాలేజీ చుట్టూ తిరిగి విసిగి పోయిన విద్యార్ధి నారాయణస్వామి ఇవాళ కాలేజీకి విద్యార్ధి సంఘం నేతలతో వచ్చినట్టుగా  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఈ విషయమై ప్రిన్సిపాల్  తో పాటు ఏఓ , విద్యార్ధులకు గాయాలయ్యాయి.

ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని చెప్పడంతో పెట్రోల్ పోసుకొని విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేశారు. అంతేకాదు దీంతో ప్రిన్సిపాల్ రూమ్ లో ఫర్నీచర్ కూడా దగ్దమైంది. ప్రిన్సిల్, ఏఓకు కూడా గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు విద్యార్ధులను తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత  మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేర్పించారు. యశోద ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్ధుల నుండి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించనున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  విద్యార్ధులు నారాయణ స్వామి, వెంకటాచారి, విద్యార్ధి సంఘం నేత సందీప్ లు గాయపడ్డారు. ప్రిన్సిపాల్  సుధాకర్ రెడ్డి, ఏఓ ఆశోక్ రెడ్డిలు కూడా గాయపడినట్టుగా మీడియా కథనాలు చెబుతున్నాయి. 

ఈ ఘటనలో గాయపడిన నారాయణ కాలేజీ ఏఓ, ప్రిన్సిపాల్  మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా రిపోర్టు చేసింది.  ఈ కాలేజీలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలేజీ వద్ద క్లూస్ టీమ్ కూడ  ఆధారాలను సేకరిస్తుంది. 

ఏపీసీ శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే..

సందీప్ అనే విద్యార్ధి సంఘం నేత పెట్రోల్ చల్లుకున్న సమయంలో  ఈ గదిలో ఉన్న దీపం వల్ల ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.  ఈ ఘటనలో  గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని శ్రీనివాస్ రెడ్డి మీడియాకు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios