హైదరాబాద్: ప్రసిద్ధ కవి, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 88 వ జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో గల అకాడమీ కార్యాలయంలో ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు. 

వనపర్తిలో సినారె వేడుకలను ఈ నెల 28 వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు సిధారెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.

వారితో పాటు కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎ.జయంతి, కన్వీనర్ డాక్టర్ కె.వీరయ్య, సభ్యులు నాగవరం బాలరాం‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వనపట్ల సుబ్బయ్య‌, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ముచ్చర్ల దినకర్, అమరనాథ్ , నరసింహశర్మ తదితరులు పాల్గొన్నారు.