కూకట్ పల్లి: తాను తెలంగాణ ఆడపడుచునేనని కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె తాను హైదరాబాద్ లోనే పుట్టానని ఇక్కడి గాలే పీల్చి బతికానని చెప్పుకొచ్చారు. 

తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తాను కూకట్ పల్లిలోనే ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని చెప్పారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని వేడుకున్నారు. ప్రజాకూటమిని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు.