తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్న సీనీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టినట్లే మేము కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామని గతంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేటీఆర్ హెచ్చరికలకు  బాలకృష్ణ పై విధంగా బదులిచ్చారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ గడ్డి అన్నారంలో రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. అప్పుడు కేటీఆర్ అన్నట్లు ఆంధ్రాకే కాదు...ఎక్కడికైనా పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆంధ్రాకు రా....చూసుకుందాం అంటూ బాలయ్య సవాల్ విసిరారు. 

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాల్లో పర్యటించి పెట్టుబడులు తెచ్చారని బాలకృష్ణ అన్నారు. కేసీఆర్ అలా తెలంగాణ అభివృద్ది కోసం ఏమైనా చేశాడు. ఆయన అధికారంలో ఉండగా చేసిందల్లా ఫామ్ హౌస్ లో పడుకోవడమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది హిస్టరీ అయితే కేసీఆర్ ది లాటరీ అంటూ తనదైన సినిమా డైలాగులతో బాలకృష్ణ విమర్శించారు.