Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 14న రాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తాం:అక్బర్‌కి కోర్టు హెచ్చరిక

ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాఖలైన కేసు విచారణకు ఈ నెల 14న హాజరు కాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. తనపై దాఖలైన పిటిషన్ పై స్టే కోరుతూ అక్బరుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. నిర్మల్ లో జరిగిన సభలో హేట్ స్పీచ్ పై ఈ కేసు  నమోదైంది.

Nampally Court orders MIM MLA Akbaruddin appear before court on sep 14
Author
Hyderabad, First Published Sep 1, 2021, 2:52 PM IST

హైదరాబాద్: నిర్మల్ హేట్ స్పీచ్ కేసులో ఈ నెల 14వ తేదీన హాజరు కాకపోతే  అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.నిర్మల్ జిల్లాలో జరిగిన  సభలో అక్బరుద్దీన్ ఓవైసీ  ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆయనపై  గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఈ నెల 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపింది కోర్టు. 

అక్బరుద్దీన్ పై నమోదైన కేసు ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి బదిలీ అయింది.  దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు సమన్లు పంపింది. ఈ విషయమై ఆయన కోర్టులో స్టే  కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 14వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈకేసు విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

2012లో నిర్మల్ లో జరిగిన సభలో హేట్ స్పీచ్ పై అక్బరుద్దీన్ పై కేసు నమోదైంది.ఈ విషయమై  న్యాయవాది కరుణా సాగర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి ఎంపీ,ఎమ్మెల్యే కోర్టుకు అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కావాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని  జడ్జి ఉత్తర్వులో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios