పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య  కేసులో మాజీ మావోయిస్టు శేషన్నకు ఊరట లభించింది.  శేషన్నను  నిర్ధోషిగా  నాంపల్లి కోర్టు ప్రకటించింది.  

హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో మాజీ మావోయిస్టు శేషన్నను శుక్రవారంనాడు నిర్ధోషిగా ప్రకటించింది నాంపల్లి కోర్టు. 2011 డిసెంబర్ 28న హైద్రాబాద్ లోని బొగ్గులకుంట వద్ద పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆటోలో మరో వ్యక్తితో కలిసి వెళ్తున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని దుండగులు హత్య చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2022 సెప్టెంబర్ 27న హైద్రాబాద్ లో సెటిల్ మెంట్ చేస్తున్న సమయంలో శేషన్నను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నయీం ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్న పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

ఈ హత్య కేసులో మాజీ మావోయిస్టు శేషన్నను ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈ కేసులో శేషన్నను నాంపల్లి కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.