దేశ ప్రధాని నరేంద్రమోదీ తో.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నామా.. ఆదివారం ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. మైనార్టీలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు రావాలన్న నరేంద్ర మోదీ.. కేసీఆర్‌ కోసమే ముందస్తు ఎన్నికలకు అంగీకరించారని ఆరోపించారు. 

మోదీ-కేసీఆర్‌లు తెర వెనుక కలిసి పనిచేస్తున్నారని.. వారిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనన్న నామా.. టీఆర్‌ఎస్‌ మరోసారి గెలిస్తే పోరాడి సాధించుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.