ఖమ్మం లోకసభ టీకెట్ కోసం నామా, రేణుకా చౌదరి పోటీ
ఖమ్మం లోకసభ సీటు కోసం ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులు పోటీ పడుతున్నారు
18

ఖమ్మం లోకసభ సీటు కోసం ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు ఓ వైపు, కాంగ్రెసు మాజీ ఎంపీ రేణుకా చౌదరి మరో వైపు ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు

28
నామా, రేణుక ఖమ్మం లోకసభ టికెట్ కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేతలిద్దరూ తమ తమ పార్టీ శ్రేణులతో సమావేశమై కార్యాచరణ రూపొందించుకుంటున్నారు

38
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నడుచుకోవాలని అధినేత చంద్రబాబు సూచించారని ఆయన ఆ సమావేశంలో చెప్పారు

48
మహాకూటమితోనే ముందుకు సాగుదామని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్నే అనుసరిస్తే టీఆర్‌ఎ్‌సను కట్టడి చేయవచ్చునని నామా అన్నారు

58
ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని అనుచరులు కోరగా.. అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పొలిట్‌బ్యూరోలో వెల్లడిస్తానని, పార్టీ నిర్ణయానికి శ్రేణులు కట్టుబడి ఉండాలని నామా తెలిపారు.

68
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ను కోరారు. కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సలీమ్ అహ్మద్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు

78
కాగా, తనకు టికెట్ ఖమ్మం టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రేణుకా చౌదరి ఇటీవల హెచ్చరించారు. అయితే, ఆ తర్వాత కాస్తా వెనక్కి తగ్గి మాట్లాడారు.

88
ఇదిలావుంటే, పొత్తులో భాగంగా ఖమ్మం, నల్లగొండ పార్లమెంటు సీట్లను తమకు కేటాయించాలని సిపిఐ తెలంగాణ కాంగ్రెసును కోరుతోంది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.

Latest Videos