తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లాల బాట పట్టింది. ఇప్పటికే బుధవారం నిజామాబాద్ జిల్లాలో భారీ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని పూర్తిస్థాయిలో మొదలుపెట్టింది. గురువారం నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభా ప్రాంగణం వద్ద ఓ యువకుడు హల్ చల్ చేశాడు.

 విజయ్ కుమార్ అనే టీఆర్ఎస్ కార్యకర్త నల్గొండ జిల్లా ప్రజా ఆశిర్వాద సభా ప్రాంగణం సమీపంలోని ఓ సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. అక్కడి నుండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశాడు. నల్గొండ ఎమ్మెల్యే టికెట్ బీసీ నాయకుడికి కేటాయించాలని డిమాండ్ చేశాడు. దీనిపై తనకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడి నుండి కిందకు రానంటూ బీష్మించుకు కూర్చున్నాడు. తనను బలవంతంగా కిందకు దించడానికి ప్రయత్నిస్తే ఇక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్ టవర్ పై నుండి ఆ కార్యకర్తను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.