Asianet News TeluguAsianet News Telugu

బుల్లెట్ బైక్ లపై వాట్సాప్ లో ఫిర్యాదు... పోలీసుల ఆంక్షలు

మీరు బుల్లెట్ బైక్ వాడుతున్నారా.. అయితే.. కొన్ని నియమాలు పాటించాలి లేకపోతే.. మీ మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Nalgonda Police: 'Silence' that's deafening: Cops target bike accessories
Author
Hyderabad, First Published Apr 1, 2019, 9:29 AM IST

మీరు బుల్లెట్ బైక్ వాడుతున్నారా.. అయితే.. కొన్ని నియమాలు పాటించాలి లేకపోతే.. మీ మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏంటి అర్థం కాలేదా..? చాలా మంది బుల్లెట్ బైక్ లు వాడుతున్న వారు సెలైన్సర్లకు అధిక శబ్దం వచ్చే మఫ్లర్లను వాడుతున్నారు. కాగా.. వారిపై నల్గొండ జిల్లా పోలీసులు దృష్టిసారించారు.

ఈ వాహనాల నుంచి వచ్చే అధిక శబ్ధంపై పలువురు ఈనెల 30న వాట్సాప్‌ ద్వారా ఎస్పీకి ఫిర్యాదుచేశారు. స్పందించిన ఎస్పీ రంగనాథ్‌.. యజమానులపై చర్యలకు పోలీసులను ఆదేశించారు. దీంతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి 10 బుల్లెట్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ సైలెన్సర్‌ స్థానంలో అధిక శబ్దం వచ్చే మఫ్లర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో వాహనానికి రూ.1,000 జరిమానా విఽధించి, పునరావృతమైతే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios